-
-
Home » Andhra Pradesh » Srikakulam » Will commit suicide if votes are dropped
-
‘ఓట్లు తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటా’
ABN , First Publish Date - 2020-03-13T10:38:46+05:30 IST
మండల రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగిం పునకు యత్నిస్తున్నారు. అదే జరిగితే కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటానని తుంగపేట మాజీ

పొందూరు, మార్చి 12 : మండల రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగిం పునకు యత్నిస్తున్నారు. అదే జరిగితే కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుంటానని తుంగపేట మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు పప్పల వేణుగోపాల్ హెచ్చరించారు. ఈమేరకు గురువారం తహసీల్దార్ టి.రామకృష్ణతో ఆయన మాట్లాడారు. ఫారం-7 పేరిట తుంగపేట గ్రామానికి చెందిన 43 ఓట్లు తొలగించేందుకు సిద్ధం చేసిన జాబితాపై నిలదీశారు. వలసదారుల ఓట్లు తొలగించాలంటే సంబంధిత వ్యక్తులకు తొలుత నోటీసులు జారీ చేయాల్సి ఉందన్నారు.
వారు ఎక్కడ ఓటు హక్కును వినియోగించు కుంటారో విచారించి ఓట్లు తొలగించాల్సి ఉన్నా.. ఆ నిబంధనలు ఏవీ అధికారులకు పట్టడంలేదన్నారు. నోటీసులు ఇవ్వకుండా తొలగింపు జాబితాను సిద్ధం చేయడమేంటని ప్రశ్నించారు. మండలంలోని చాలాగ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందనీ.. ఇదే జరిగితే బాధితులతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అందుకు రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆయనతో పాటు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కూన సత్యనారా యణ, టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ తదిత రులు ఉన్నారు.