కేంద్రంపై పోరాటం సాగిస్తాం

ABN , First Publish Date - 2020-11-08T04:54:08+05:30 IST

ప్రజలపై వివిధ రూపాల్లో పన్నుల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దడాల సుబ్బారావు అన్నారు.

కేంద్రంపై పోరాటం సాగిస్తాం
శ్రీకాకుళంలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు

గుజరాతీపేట/ఎచ్చెర్ల: ప్రజలపై వివిధ రూపాల్లో పన్నుల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దడాల సుబ్బారావు అన్నారు. కేంద్ర విధానాలను నిరసిస్తూ శ్రీకాకుళం అంబేడ్కర్‌ జంక్షన్‌, ఎచ్చెర్లలో శనివారం ప్రచార కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని,  విద్యుత్‌ రంగాన్ని ప్రైవేట్‌పరం చేయవద్దని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాపై  కేంద్రాన్ని ఏ పార్టీ ప్రశ్నించడం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15 వరకు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలి పారు.  కార్యక్రమంలో  సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, డివిజన్‌ కార్యదర్శి ఎన్‌వీ రమణ, నేతలు డి.బంగార్రాజు, టి.రామారావు, శ్రీనివాస్‌, టి.తిరుపతిరావు  తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస:ధరలు, పన్నులు పెంచి పేదపై మోపిన భారాన్ని తగ్గించాలని సీఐటీయూ  నాయకురాలు కె.నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. శనివారం ఆమదాలవలసలో సీపీఎం పిలుపు మేరకు  కరపత్రాలను పంపిణీచేశారు. కార్యక్రమంలో నాయకులు బి.మోహనరావు, పి.కృష్ణారావు పాల్గొన్నారు. భామిని: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని సీపీఎం మండల కార్యదర్శి శిర్లప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బాలేరులో బీజేపీ  విధానాలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జగన్నాయకులు. ప్రసాద్‌, పుష్పనాధం, మల్లేష్‌  పాల్గొన్నారు. పాలకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు ఆపాలని సీపీఎం పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు కోరారు. శుక్రవారం పాలకొండ ఏలాం జంక్షన్‌ నుంచి సీపీఎం నాయకులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రచార కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అర్తమూడి లక్ష్మణరావు, గిరి హేమసుందరరావు, దూసి దుర్గారావు, కాద రాము, ఎస్‌.నారాయ ణరావు, బి.పట్టాబి, గుండు సుధీర్‌, ఎస్‌.మజ్జయ్య, కరువయ్య, ఉరియ, జె.దుర్గ  పాల్గొన్నారు.  సోంపేట రూరల్‌: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. పాలవలసలో సీపీఎం ప్రచారజాత చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, భాస్కరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-08T04:54:08+05:30 IST