అర్హులందరికీ సరుకులు అందజేస్తాం

ABN , First Publish Date - 2020-12-12T05:24:46+05:30 IST

అర్హులందరికీ పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యా వసరసరుకులు ప్రభుత్వం అందజేస్తుందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

అర్హులందరికీ సరుకులు అందజేస్తాం
ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం

  స్పీకర్‌ తమ్మినేని సీతారాం

పొందూరు: అర్హులందరికీ  పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యా వసరసరుకులు ప్రభుత్వం అందజేస్తుందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. శుక్రవారం పొందూరులో ఎంఎల్‌ఎస్‌పాయింట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడు తూ గత ప్రభుత్వహయాంలో పొందూరులోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ జి.సిగడాం తరలించారని తెలిపారు.దీంతో ఇక్కడ పనిచేసే హమాలీలు ఇబ్బందులు ఎదుర్కొ న్నారని చెప్పారు. వారి  సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పొందూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు.ఫ పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో శుక్రవారం మన బడి నాడు-నేడు పఽథకంలో భాగంగా రూ.1.47 కోట్లతో నిర్మించనున్న తరగతి గదులకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వపాఠశాలల్లో  మౌలిక సదుపా యాలు కల్పించి పేదవిద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈసందర్భంగా పొందూరు లోని పలు సమస్యలను వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పప్పల మున్నా స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు.కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ పీవో పైడి రమణ మూర్తి, డిప్యూటీఈవో పగడామ్మ,హెచ్‌ఎం రామరాజు, తహసీల్దార్‌ పి.అమల పాల్గొన్నారు.



Updated Date - 2020-12-12T05:24:46+05:30 IST