మహనీయుల అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2020-08-16T12:01:47+05:30 IST

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించామని, వారి అడుగుజాడల్లో పయనించాలని ఎమ్మెల్యే కంబాల

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి

ఎమ్మెల్యే కంబాల జోగులు


రాజాం/ రూరల్‌,  ఆగస్టు 15: ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించామని, వారి అడుగుజాడల్లో పయనించాలని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా  శనివారం నగరపంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాలతో పాటు ఆయన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభావతి, జనజాగృతి ట్రస్టు వ్యవస్థాపకుడు సప్పటి వసంతరావు సహకారంతో కొవిడ్‌ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.చంద్రశేఖర్‌ నాయుడు ఆధ్వ ర్యంలో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి ఎమ్మెల్యే జోగులు సత్కరించా రు. కార్యక్రమంలో కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, ఎంపీడీవో బాసూరు శంకర రావు, పార్టీ నాయకులు పాల వలస శ్రీనివాసరావు, యాలాల వెంక టేష్‌ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వంగా వెంకటరావు జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో టంకాల నాగరాజు, మీసాల సత్యం నాయుడు పాల్గొన్నారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సెంట్‌నీల్‌ కబ్‌ సౌజన్యంతో దివ్యాంగులకు వీల్‌చైర్స్‌ పంపిణీ చేశారు. కార్యదర్శి అమృత సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


 స్వాతంత్య్ర ఫలాలు భావితరాలకు అందించాలి

టెక్కలి: ఎందరో త్యాగాలు ఫలితంగా సాధించిన స్వాతంత్య్ర ఫలాలు భావితరాలకు అందించాల్సినన బాధ్యత అందరిపై ఉందని సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ధనుంజయ్‌ అన్నారు. శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా నియంత్రణలో శ్రమిస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులను అభినందించారు. ఏవో కళ్యాణచక్రవర్తి పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ కార్యాలయాలతో పాటు ఆదిత్య ఇంజినీరింగ్‌,  జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, ప్రెవేటు పాఠశాలల్లో జెండా ఆవిష్కరించారు.


భారతావని అభివృద్ధిలో భాగస్వామ్యం : ‘బగ్గు’

నరసన్నపేట/రూరల్‌: పేదలకు స్వాతంత్య్ర ఫలాలు రాజకీయాలకు అతీతంగా అందాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద జెండా వందనం నిర్వహించారు.


స్వతంత్ర భారతావని అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో పోలాకి మాజీ జడ్పీటీసీ మాజీ సభ్యుడు రోణంకి కృష్ణంనాయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ  చైర్మన్‌ బైరి భాస్కరరావు, నాయకులు శిమ్మ చంద్రశేఖర్‌,  గొద్దు చిట్టిబాబు, పీస కృష్ణ,  బలగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-16T12:01:47+05:30 IST