రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ‘వెన్నెల’

ABN , First Publish Date - 2020-12-25T05:54:21+05:30 IST

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 26న నిర్వహించనున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌కు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ తరఫున జి.వెన్నెల ఎంపికయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారుల నుంచి వర్సిటీకి సమాచారం అందింది.

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ‘వెన్నెల’
వెన్నెలను అభినందిస్తున్న దృశ్యం

ఎచ్చెర్ల : దేశ రాజధాని న్యూ ఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 26న నిర్వహించనున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌కు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ తరఫున జి.వెన్నెల ఎంపికయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారుల నుంచి వర్సిటీకి సమాచారం అందింది. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వెన్నెల బీఎస్సీ ద్వితీయ సంవత్సరం  చదువుతోంది. ఈ సందర్భంగా ఆమెను వర్సిటీ రిజిస్ట్రార్‌ కె.రఘుబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ ఇన్‌చార్జి కోఆర్డినేటర్‌ కె.ఉదయకిరణ్‌ అభినందించారు. గత నెలలో హైదరాబాద్‌లో పది రోజుల పాటు నిర్వహించిన ప్రాంతీయ శిక్షణ శిబిరంలో వెన్నెల పాల్గొని ప్రతిభ చూపింది. దీంతో ఈమెను జాతీయ స్థాయి పరేడ్‌కు ఎంపిక చేశారు.  

Updated Date - 2020-12-25T05:54:21+05:30 IST