మోపాడు రిజర్వాయర్‌కు వెలిగొండ నీటిని అనుసంధానం చేయాలి

ABN , First Publish Date - 2020-12-29T04:45:09+05:30 IST

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ నీటిని మోపాడు రిజర్వాయర్‌కు అనుసంధానం చేయాలని పూల సుబ్బయ్య, వెలిగొండ ప్రాజెక్ట్‌ సాధన సమితి అధ్యక్షుడు వడ్డె శ్రీనివాస్‌ కోరారు.

మోపాడు రిజర్వాయర్‌కు   వెలిగొండ నీటిని అనుసంధానం చేయాలి
కంభాలదిన్నెలో పోస్టు కార్డులతో ప్రజలుపామూరు, డిసెంబరు 28: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ నీటిని మోపాడు రిజర్వాయర్‌కు అనుసంధానం చేయాలని పూల సుబ్బయ్య, వెలిగొండ ప్రాజెక్ట్‌ సాధన సమితి అధ్యక్షుడు వడ్డె శ్రీనివాస్‌ కోరారు. మండలంలోని కంభాలదిన్నె గ్రామంలో సోమవారం పోస్టు కార్డు ఉద్యమం చేపట్టి సంతకాల సేకరణ చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ నీరు మోపాడు రిజర్వాయర్‌, పీసీపల్లి మండలం అనుసంధానం చేయాలని గత కొద్దికాలంగా పోస్టుకార్డుల ఉద్యమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో లక్షకు పైగా పోస్టు కార్డులను రైతుల అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రికి  అం దించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మన్నం రమణయ్య, గోళ్ల రమేష్‌ చౌదరి, పిచ్చాల మాలకొండారెడ్డి, గోళ్ల మాచర్ల, గోళ్ల కొండయ్య, నట్టా మాల్యాద్రి, కనకాద్రి, అంజయ్య, అయ్యనీడి కొండలరావు, జి మహేష్‌, ఏ లూరి నరసింహం, లాసరు, వెంకటేశ్వర్లు, ఎ రామిరెడ్డి, గౌరవ సలహాదారుడు పోలినేని తిరుపతయ్య, గోళ్ల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T04:45:09+05:30 IST