రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-11-03T06:03:33+05:30 IST

రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. సోమవారం పశుసంవర్ధకశాఖ, జేకే ట్రస్టు ఆధ్వర్యంలో తాలాడలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

రైతు సంక్షేమమే ధ్యేయం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగులు

 


 రైతు సంక్షేమమే ధ్యేయం

సంతకవిటి, నవంబరు 2: రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. సోమవారం పశుసంవర్ధకశాఖ, జేకే ట్రస్టు ఆధ్వర్యంలో  తాలాడలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుభరోసా అందించామన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా అంది స్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖాధికారులు మాణిక్యాలరావు, ఈశ్వరరావు, జగన్నాఽథం, పశు వైద్యాధికారులు గుప్త, సుమన్‌, రాము,  వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

 మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగులు  (ఎస్‌కెటి 1ఎ)


 

Updated Date - 2020-11-03T06:03:33+05:30 IST