-
-
Home » Andhra Pradesh » Srikakulam » Transfer to another six SIs in the district
-
జిల్లాలో మరో ఆరుగురి ఎస్‌ఐలకు బదిలీ
ABN , First Publish Date - 2020-12-11T05:18:35+05:30 IST
జిల్లాలో మరో ఆరుగురి ఎస్‌ఐలకు బదిలీచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకరోజు కిందటే పదకొండు మంది ఎస్‌ఐలను బదిలీచేసిన విషయం తెలిసిందే.

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 10: జిల్లాలో మరో ఆరుగురి ఎస్‌ఐలకు బదిలీచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకరోజు కిందటే పదకొండు మంది ఎస్‌ఐలను బదిలీచేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం రాత్రి మరో ఆరుగురి ఎస్‌ఐలకు బదిలీ చేస్తూ(అటాచ్) ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలు జారీచేశా రు. తక్షణమే బదిలీ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా ఇద్దరు ఎస్‌ఐలు విశాఖ రేంజ్ నుంచి పదోన్నతిపై బదిలీపై వచ్చారు.
మహిళా స్టేషన్ సీఐగా లలిత
శ్రీకాకుళం మహిళా పోలీసు స్టేషన్ సీఐగా బి.లలిత నియమితులయ్యారు. ఇదివరకు మహిళా స్టేషన్‌కు డీఎస్పీగా డీవీఆర్‌ఎస్‌వీఎన్ మూర్తి విధులు నిర్వహించారు. ఇటీవలే ఆయన బదిలీ అయ్యారు. ప్రస్తుతం దిశ పోలీసు స్టేషన్‌కు మాత్రమే డీఎస్పీ హోదాఉంది. మహిళా పోలీసు స్టేషన్‌కు సీఐను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఇందులో భాగంగా గతంలో నగరంలో రెండోపట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి.. ప్రస్తుతం విశాఖరేంజ్‌లో ఉంటున్న బి.లలితను మళ్లీ జిల్లాకు వస్తున్నారు. ఈ మేరకు డీఐజీ కాళిదాస్ రంగారావు గురువారం రాత్రి ఉత్తర్వులను జారీచేశారు.