రైతులను ఇబ్బంది పెడితే సహించం

ABN , First Publish Date - 2020-12-29T04:52:24+05:30 IST

ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా నిర్లక్ష్యంగా వ్యహరిస్తే కఠినచర్యలు తప్పవని జేసీ సుమిత్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొందరు మిల్లరు రైతులకు ఇబ్బందులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అటువంటివి ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే సహించం
అధికారులతో మాట్లాడుతున్న జేసీ సుమిత్‌కుమార్‌
జేసీ సుమిత్‌కుమార్‌

రాజాం, డిసెంబరు 28: ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా నిర్లక్ష్యంగా వ్యహరిస్తే కఠినచర్యలు తప్పవని జేసీ సుమిత్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొందరు మిల్లరు రైతులకు ఇబ్బందులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అటువంటివి ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తూకంలో తేడాలు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంత మంది రైతులు రైతుభరోసా కేంద్రాల్లో పేర్లు నమోదుచేసుకున్నారో వారందరితో మాట్లాడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  అనంతరం పట్టణంలోని రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. గిట్టుబాటు ధర అందిస్తున్నారా లేదా అని అక్కడున్న రైతులను ప్రశ్నించారు. అయితే సంతకవిటి మండలానికి చెందిన రైతులు ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయడం లేదని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి రైస్‌మిల్లు యజమానులు అంగీకరించారు. జేసీ వెంట తహసీల్దారు పి.వేణుగోపాలరావు, సీఎస్‌డీటీ రంజిత్‌, ఏవో ఎం.రేణుకాసాయి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T04:52:24+05:30 IST