‘నాడు-నేడు’ పనులు నాణ్యతగా ఉండాలి

ABN , First Publish Date - 2020-11-26T05:11:22+05:30 IST

పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో నాణ్యతలోపిస్తే చర్య లు తీసుకోవడంతో పాటు బిల్లులు నిలిపివేస్తామని సమగ్ర శిక్షా అభియాన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ (విజయవాడ)శ్రీనివాసరావు హెచ్చరించారు.

‘నాడు-నేడు’ పనులు నాణ్యతగా ఉండాలి
పొందూరుకేజీబీవీ పనులు పరిశీలిస్తున్న అధికారులు


 లేదంటే బిల్లులు నిలిపేస్తాం 

ఎస్‌ఎస్‌ఏ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు

పొందూరు: పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో నాణ్యతలోపిస్తే చర్య లు తీసుకోవడంతో పాటు బిల్లులు నిలిపివేస్తామని  సమగ్ర శిక్షా అభియాన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ (విజయవాడ)శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం లోలుగు కేజీబీవీలో జరుగుతున్న నాడు-నేడు పనులను  పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించాలని తెలిపారు.  ఆయనతో పాటు ఎస్‌ఎస్‌ఏ ఈఈ వి.వెంకటేశ్వరరావు కేజీబీవి ప్రత్యేకాధికారి బి.సుధ ఉన్నారు. ఫ  ఇచ్ఛాపురం రూరల్‌ : పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో బి.వెంకటరమణ తెలి పారు. బుధవారం శాసనం జడ్పీ ఉన్నతపాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, హెచ్‌ఎం ఎ.చిరంజీవిరావు పాల్గొన్నారు.


Read more