టిడ్కో ఇళ్లు అందజేయడంలో నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-16T04:46:21+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలో నిర్లక్షం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే సమా ధానం చెబుతారని టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు.

టిడ్కో ఇళ్లు అందజేయడంలో నిర్లక్ష్యం
బాధితులకు సామగ్రి అందజేస్తున్న రవికుమార్‌

   టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రవికుమార్‌

పొందూరు: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలో నిర్లక్షం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే సమా ధానం చెబుతారని టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు.పొందూరులో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు తక్షణమే పక్కా ఇళ్లను  మంజూరు చేయాలని  కోరారు. బాధితులకు  వంట సామగ్రి, వస్త్రాలు అందించారు. పార్టీ మండలాధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, పట్టణాధ్యక్షుడు ఎ. శ్రీరంగనాయకులు, పార్టీ నాయకులు ఎ. అక్కల నాయుడు, కె. శ్రీనివాసరావు, బాడాన గిరి, ఆదినారాయణ పాల్గొన్నారు.ఫఅగ్నిప్రమాద బాధితులకు పక్కాగృహాలు మంజూ రు చేయడానికి  అధికారులకు  స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశాలు ఇచ్చారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌ తెలిపారు. ఆదివారం పొందూరులో అగ్నిప్రమాద  బాధితులను  పరామర్శించారు. తమ్మినేని ఇందుమతమ్మ చారిటబుల్‌ట్రస్టు తరపున బాధితులకు వంటపా త్రలు, బియ్యం అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ మండలాధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి. వైసీపీ రాష్ట్ర సహాయకార్యదర్శులు పప్పల రమణమూర్తి, లోలుగు కాంతారావు, ఏఎంసీ చైర్మన్‌ బి.సునీల్‌, గుడ్ల మోహన్‌, కొంచాడ గిరిబాబు, గాడు నాగరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-16T04:46:21+05:30 IST