-
-
Home » Andhra Pradesh » Srikakulam » Tidco homes for the deserving
-
అర్హులకు టిడ్కో గృహాలు
ABN , First Publish Date - 2020-11-26T05:12:41+05:30 IST
అర్హులందరికీ టిడ్కో గృహాల పట్టాలు క్రిస్మస్ నాటికి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోర్ తెలిపారు.

సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
ఇచ్ఛాపురం: అర్హులందరికీ టిడ్కో గృహాల పట్టాలు క్రిస్మస్ నాటికి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోర్ తెలిపారు. బుధవారం ఇచ్చాపురం మునిసిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. మంజూరైన టిడ్కో లబ్ధిదారుల వివరాలు అడిగితెలుసుకొని రికార్డులు తనిఖీచేశారు. మూడో వార్డులో గల ఏఎస్‌పేట కాలనీలో నిర్మాణదశలో ఉన్న 624 టిడ్కో గృహాలు, చింతామణి ఆలయం వెనుకభాగంలో నిర్మాణంలో ఉన్న మరో 192 గృహాలు, అర్బన్ హౌసింగ్ స్థలాలను పరిశీలించారు. మునిసిపల్ మార్కెట్ షాపులు, బస్టాండ్‌లో ఉన్న షాపింగ్‌కాంప్లెక్స్‌లను కూడా పరిశీలించి, వీటి నుంచి వస్తున్న ఆదాయంపై కమిషనర్ లాలం రామలక్ష్మికి అడిగితెలుసుకున్నారు. అనం తరం కేశుపురం, బూర్జుపాడుల్లో తగాదాల్లో ఉన్న భూములు పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మురళీమోహన్‌రావు, డీటీ శ్రీహరి పాల్గొన్నారు. ఫ సచివాలయాలకు వచ్చిన ప్రజలకు సకాలంలో సేవలు అందివ్వాలని కమిషనర్ లాలం రామలక్ష్మి తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలోని కండ్ర, డబ్బూరివీధులు, దాసన్నపేట, బంగ్లారోడ్డులో గల సచివాలయాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫసోంపేట: బిరుసువాడలోని చెరువుచుట్టూ ఉపాధిహామీ నిధులతో కంచెవేయాలని డిప్యూటీ కలెక్టర్ సూరజ్ ధనుంజయ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇక్కడి చెరువు కబ్జాకు గురవుతుందని ఫిర్యాదుమేరకు గురువారం రెవెన్యూ అధికారులతో పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదాశివుని గురుప్రసాద్, సర్వేయర్ మల్లిఖార్జున పాణిగ్రాహి పాల్గొన్నారు.