టిడ్కో లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు సిద్ధంకావాలి

ABN , First Publish Date - 2020-11-08T05:27:52+05:30 IST

టిడ్కో లబ్ధిదారులు ఈ నెల 14న గృహ ప్రవేశాలకు సిద్ధంకావా లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. పార్టీ నగర, పట్టణ, జిల్లా కార్యదర్శులు, జిల్లా ముఖ్య నాయకులతో ఆయన జూమ్‌ యాప్‌ ద్వారా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

టిడ్కో లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు సిద్ధంకావాలి


గుజరాతీపేట:టిడ్కో లబ్ధిదారులు ఈ నెల 14న గృహ ప్రవేశాలకు సిద్ధంకావా లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. పార్టీ నగర, పట్టణ, జిల్లా కార్యదర్శులు, జిల్లా ముఖ్య నాయకులతో ఆయన జూమ్‌ యాప్‌ ద్వారా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 14 నాటికి ప్రభుత్వం లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించకపోతే వారితో తమ పార్టీ గృహ ప్రవేశం జరిపేం దుకు సిద్ధంగా ఉందని తెలిపారు. శ్రీకాకుళం నగరంలో 1877ఇళ్లు, పలాసలో 1104, రాజాంలో 1104, ఇచ్ఛాపురంలో 528, ఆమదాలవలసలో 528 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు, నాయకులు శ్రీరామ్మూర్తి, చిక్కాల గోవిందరావు, చాపర వేణుగోపాల్‌, జి.రాజేశ్వరరావు, పెంకి కృష్ణ పాల్గొన్నారు. Updated Date - 2020-11-08T05:27:52+05:30 IST