-
-
Home » Andhra Pradesh » Srikakulam » three wheeler car accident seven members injured
-
ఆటోను ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2020-11-22T05:29:17+05:30 IST
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై నన్నూరు గ్రామ సమీపంలో నారాయణ కాలేజీ ఎదురుగా శనివారం ఆటోను కారు ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి.

ఏడుగురికి గాయాలు
ఓర్వకల్లు, నవంబరు 21: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై నన్నూరు గ్రామ సమీపంలో నారాయణ కాలేజీ ఎదురుగా శనివారం ఆటోను కారు ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తున్న ఆటోను బనగానపల్లె నుంచి వస్తున్న కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నంద్యాల పట్టణం మిట్నాల కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ హుశేన్, కేవీ లలిత, కేవీ జగన్ మోహన్, హనుమంతు కుమార్, శ్రీహర్ష, సీతారామయ్య, కారులో ప్రయాణిస్తున్న బనగానపల్లెకు చెందిన నారాయణరెడ్డికి గాయాలయ్యాయి. ఆటో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.