‘జగనన్నతోడు’ అమలులో చిత్తశుద్ధి లేదు

ABN , First Publish Date - 2020-11-27T04:59:06+05:30 IST

జగనన్న తోడు పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయ డం తప్ప అమలు, లబ్ధిదారులకు మేలు చేయడంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆరోపించారు.

‘జగనన్నతోడు’ అమలులో చిత్తశుద్ధి లేదు
మాట్లాడుతున్న నిమ్మక జయకృష్ణ

పాలకొండ: జగనన్న తోడు పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయ డం తప్ప  అమలు, లబ్ధిదారులకు మేలు చేయడంపై  చిత్తశుద్ధి కనిపించడం లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ  ఆరోపించారు. గురువారం పాలకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకుల నుంచి ప్రజలకు ఇచ్చే రుణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలి కాని ఇక్కడ హామీ ఇవ్వకుండా రుణాలిచ్చేయండి అంటూ లబ్ధిదారులకు సూచించడం ప్రజ ల్ని వంచించడమేనన్నారు.కేంద్రం ఇస్తున్న నిధులకు అదనంగా ఒక్క రూపాయి కూడా చేర్చకపోగా అంతా తామే చేస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.

Updated Date - 2020-11-27T04:59:06+05:30 IST