పన్నుల భారం తగ్గించాలి

ABN , First Publish Date - 2020-12-12T05:19:44+05:30 IST

పెంచిన పన్నులను తక్షణమే తగ్గించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆస్తిపన్ను, దుకాణాల అద్దె పెంపునకు నిరసనగా పలాస మునిసిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, పన్నులను పెంచి సామాన్య ప్రజానీ కాన్ని ఇబ్బంది పెట్టడం తగదన్నారు.

పన్నుల భారం తగ్గించాలి
మునిసిపల్‌ కమిషనర్‌ నారాయణకు వినతిపత్రం అందిస్తున్న గౌతు శిరీష

ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదు

తాగునీటిని అందించలేని స్థితిలో ప్రభుత్వం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

పలాస, డిసెంబరు 11: పెంచిన పన్నులను తక్షణమే తగ్గించాలని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆస్తిపన్ను, దుకాణాల అద్దె పెంపునకు నిరసనగా పలాస మునిసిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, పన్నులను పెంచి సామాన్య ప్రజానీ కాన్ని ఇబ్బంది పెట్టడం తగదన్నారు.  ‘కాశీబుగ్గ బస్టాండ్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అద్దెలు పెంచడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండేళ్లుగా వ్యాపారాలు లేక పస్తులు ఉంటున్నారు. వ్యాపారులపై 200 శాతం పన్నులు పెంచడం అన్యాయం. తక్షణం అద్దెలు తగ్గించాలి. పారిశుధ్య కార్మికులకు పూర్తిస్థాయి వేతనాలు అందించాలి. ప్రజలకు తాగునీటిని అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏలూరులో కేవలం నీటి కలుషితం కారణంగానే ప్రజలు మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుద్ధ జలాలు అందించి ఉంటే ఈ  పరిస్థితి వచ్చేది కాదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సూదికొండ, నెమలికొండలపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా యంత్రాంగం చోద్యం చూస్తోంది. మొగిలిపాడు చెరువును కబ్జా చేసినా పట్టించుకోవడం లేదు. ఆక్రమణదారులపై  ప్రభుత్వం, మంత్రి అప్పలరాజు చూపిస్తున్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదు. వార్డుల్లో ఇన్‌చార్జిల పేరుతో వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు. పేదల ఇళ్ల పట్టాలను బలవంతంగా తీసుకుంటున్నారు. దీనిపై ప్రజల్లో తిరుగుబాటు రాక తప్పదు.’ అని శిరీష హెచ్చరించారు. ముందుగా స్థానిక  పార్టీ కార్యాలయం నుంచి మునిసిపల్‌ కార్యాలయం వరకు టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమిషనర్‌ ఎన్‌వీవీ నారాయణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, నాయకులు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, బత్తిన హేమేశ్వరరావు, బడ్డ నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:19:44+05:30 IST