పార్టీ అభ్యర్థుల విజయం ఖాయం

ABN , First Publish Date - 2020-03-13T10:49:04+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి కృష్ణదాస్‌

పార్టీ అభ్యర్థుల విజయం ఖాయం

టీడీపీది నామమాత్రపు పోటీ 

మంత్రి కృష్ణదాస్‌


గుజరాతీపేట, మార్చి 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి కృష్ణదాస్‌ అన్నారు. గురువారం వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీది నామ మాత్రపు పోటీ అని అన్నా రు. నాయకుల కుటుంబ సభ్యులు ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ ఆదేశించిందని, ఈ మేరకు తన కుమారుడి నామినేషన్‌ను ఉపసంహరిస్తామని చెప్పారు. పార్టీలో ఎవరైనా చేరాలనుకున్నా వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజక వర్గ  అధ్యక్షురాలు డా.కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లని కోరారు. అంతకు ముందు పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్ర హానికిపూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంధవరపు వరం, ఎంవీ పద్మావతి, అంధవరపు సూరిబాబు, సురంగి మోహనరావు, ఎన్ని ధనుంజయరావు, కోణార్క్‌ శ్రీను, దానేటి శ్రీధర్‌, చౌదరి సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T10:49:04+05:30 IST