-
-
Home » Andhra Pradesh » Srikakulam » The services of Sattar Loknath Naidu are second to none
-
సత్తారు లోకనాథం నాయుడు సేవలు మరువరానివి
ABN , First Publish Date - 2020-12-28T05:29:17+05:30 IST
టెక్కలి ప్రాంత అభివృద్ధిలో సత్తారు లోకనాథంనాయుడుది కీలకపాత్ర అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయు డు అన్నారు. ఆదివారం అంబేద్కర్ భవన్ సమీపంలో లోకనాథంనాయుడి సంతాప సభ నిర్వహించారు. ముందు గా ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివా ళులర్పించారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
టెక్కలి, డిసెంబరు 27: టెక్కలి ప్రాంత అభివృద్ధిలో సత్తారు లోకనాథంనాయుడుది కీలకపాత్ర అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయు డు అన్నారు. ఆదివారం అంబేద్కర్ భవన్ సమీపంలో లోకనాథంనాయుడి సంతాప సభ నిర్వహించారు. ముందు గా ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, ఆర్టీసీ కాంప్లెక్స్, వంశధార కాలువ నిర్మాణం, పాలకేంద్రం, సమితి కార్యాలయం వంటి నిర్మాణాలు లోకనాథంనాయుడు హయాంలోనే జరిగా యని గుర్తుచేశారు. టెక్కలిలో సత్తారు విగ్రహం ఏర్పాటు కు తనవంతు సహకారమందిస్తానన్నారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణిమాట్లాడుతూ ఏ పదవిలో ఉన్నా సత్తారు ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు మరువరన్నారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ మా ట్లాడుతూ రెండు దశా బ్దాల కాలం జిల్లా రాజకీయాల్లో గుర్తింపుతెచ్చుకున్న వ్యక్తి లోకనాఽథంనాయుడు అని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీఎల్‌ఎన్ భుక్త, వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్, నాయకులు చింతాడ దిలీప్, మెట్ట రామారావు, కణితి కిరణ్‌కుమార్, హనుమంతు ఉదయభాస్కర్, చాపర సుందర్‌లాల్, హనుమంతు కృష్ణారావు, చింతాడ మంజు, తిర్లంగి జానకిరామయ్య, సత్తారు ఉషారాణి, పేడాడ పరమేశ్వరరావు, సత్తారు వెంకటరమణ, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.