-
-
Home » Andhra Pradesh » Srikakulam » The process of raising property tax should be stopped
-
ఆస్తిపన్ను పెంపు ప్రక్రియ నిలిపివేయాలి
ABN , First Publish Date - 2020-12-15T06:20:12+05:30 IST
ఆస్తి పన్ను పెంపు పక్రియ నిలిపివేయాలని, దీని కోసం ప్రభు త్వం విడుదలచేసిన సర్క్యూలర్ ఉపసంహరించుకోవాలని ఏపీ పట్టణ పౌర సమాఖ్య పాలకొండ నగరపంచాయతీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

పాలకొండ: ఆస్తి పన్ను పెంపు పక్రియ నిలిపివేయాలని, దీని కోసం ప్రభు త్వం విడుదలచేసిన సర్క్యూలర్ ఉపసంహరించుకోవాలని ఏపీ పట్టణ పౌర సమాఖ్య పాలకొండ నగరపంచాయతీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమ వారం పాలకొండలో పట్టణ పౌరసమాఖ్య పాలకొండ నగరపంచాయతీ ప్రతినిధి కాయల రమేష్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మంచి నీటి, డ్రైనేజీ చార్జీలు పెంచడానికి ఇచ్చిన జీవోలు 197,196లను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు, పట్టణ పౌర సమాఖ్య ప్రతినిధులు గోగుల జోగినాయుడు, పి.అనందరావు పాల్గొన్నారు.