-
-
Home » Andhra Pradesh » Srikakulam » The pride of the authorities on the poor is inappropriate
-
పేదలపై అధికారుల ప్రతాపం తగదు
ABN , First Publish Date - 2020-11-22T05:18:54+05:30 IST
ఇసుక తరలింపు విషయంలో పెద్దలను విడిచిపెట్టి పేదలపై అధికారులు ప్రతాపం చూపడంపై శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూనరవికుమార్ మండిపడ్డారు. కొరపాం, ఎన్‌టీవాడ, కొత్తవలస, తొగరాం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను శనివారం పరామర్శించారు.

కూన రవికుమార్
ఆమదాలవలస: ఇసుక తరలింపు విషయంలో పెద్దలను విడిచిపెట్టి పేదలపై అధికారులు ప్రతాపం చూపడంపై శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూనరవికుమార్ మండిపడ్డారు. కొరపాం, ఎన్‌టీవాడ, కొత్తవలస, తొగరాం గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను శనివారం పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారం వచ్చిన త ర్వాత ఇసుక కొరతతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. వైసీపీ నేతల కనుస న్నల్లో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతోందని చెప్పారు. సామాన్యులు టైరు బళ్లపై ఇసుకను తీసుకెళ్తుంటే అఽధికారులు కేసులు నమోదు చేయడం దారుణమ న్నారు. ఇసుక కోసం సచివాలయాల్లో అనుమతిఇవ్వడం లేదని, తక్షణమే కలెక్టర్ చొరవచూపి టైరు బళ్లకు నిబంధనలు తొలగించాలని కోరారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులపై కేసులు పెట్టడం తగదన్నారు. పోలవరం రివర్స్ టెండర్లు పేరుతో పనులు పూర్తిచేయకుండా అడ్డుకుని ఆ పార్టీ నాయకులు నీతివాఖ్యలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. ఆయనతోపాటు బోర గోవిందరావు, జి.సురేష్‌కుమార్ జి.మల్లేశ్వరరావు ఉన్నారు.