వర్షానికి తడిసి వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-11-13T05:50:06+05:30 IST

వర్షానికి తడిసి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆర్‌.బెలగాంలో చోటు చేసుకుంది.

వర్షానికి తడిసి వృద్ధుడి మృతి


కవిటి: వర్షానికి తడిసి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆర్‌.బెలగాంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కె.వాసునారాయణ వివరాల మేరకు.. కంచిలి మండలం బి.నారాయణపురానికి చెందిన బొడియా మాధవ్‌(80) అనే వృద్ధుడు ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అయితే, బుధవారం కురిసిన వర్షానికి ఆయన పూర్తిగా తడిసిపోవడంతో ఆర్‌.బెలగాంలో సమీపంలోని రోడ్డుపక్కన మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Updated Date - 2020-11-13T05:50:06+05:30 IST