‘ఆదాయ లక్ష్యం రూ.30 లక్షలు’

ABN , First Publish Date - 2020-03-15T10:31:22+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తనిఖీలు

‘ఆదాయ లక్ష్యం రూ.30 లక్షలు’

పొందూరు, మార్చి 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తనిఖీలు నిర్వహించి రూ.30 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యమని విశాఖపట్నం స్క్వాడ్‌ డీఎఫ్‌వో పడాల సూర్యనారాయణ చెప్పారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో  ఇప్పటిదాకా రూ.26 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. తన పరిధిలో సుమారు 300 సామిల్‌లు ఉన్నాయని, ఏడాదిలో కనీసం ఒక్కసారైనా తనిఖీలు చేయాల్సి ఉందని తెలిపారు.


కలప విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే పరిస్థితిని బట్టి జరిమానా విధిస్తామన్నారు. సామాజిక అడవుల పెంపకంలో సామిల్‌ యజమానులకు బాధ్యత ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.36 లక్షల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని వివరించారు. షెడ్యూల్‌ ఏరియాకు 5 కిలోమీటర్ల లోపు సామిల్‌లు ఏర్పాటు నిషిద్ధమని చెప్పారు. కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేసి తనిఖీలు చేపడుతున్నామన్నారు.

Updated Date - 2020-03-15T10:31:22+05:30 IST