మన జాతి భవిష్యత్‌ సంపద బాలలే...!

ABN , First Publish Date - 2020-11-16T04:41:34+05:30 IST

మన జాతి భవిష్యత్‌ సంపద నేటి బాలలే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయడు అన్నారు.

మన జాతి భవిష్యత్‌ సంపద బాలలే...!

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 15:  మన జాతి భవిష్యత్‌ సంపద నేటి బాలలే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయడు అన్నారు. ఆయన శనివారం నెహ్రూ జయంతి సందర్భంగా నిమ్మాడ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన నెహ్రూ అడుగుజాడల్లో నడవాలని కోరారు.


పలాస: కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో నెహ్రూ జయంతి పురస్కరించుకొని శనివారం చైల్డ్‌ లైన్‌ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వ హించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శివరామిరెడ్డి బాలల హక్కుల పరిరక్షణకు చైల్డ్‌లైన్‌ చేస్తున్న కృషిని అభినందించారు. మందస: మందస దేవరవీధిలో ఆదివారం బాలల దినోత్సవం పురస్కరించుకొని బాలల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.శివాజీ, లాస్యప్రియ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బాలలు హర్షిత, హాసిని, అవినాష్‌, వర్షిణి, ప్రదీప్‌సాహు, ఆర్‌.దిలీప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T04:41:34+05:30 IST