-
-
Home » Andhra Pradesh » Srikakulam » The fishing assurance should not be neglected
-
‘మత్స్యకార భరోసా’పై నిర్లక్ష్యం తగదు
ABN , First Publish Date - 2020-12-11T04:56:32+05:30 IST
మంచినీళ్లపేటలో మత్స్యకార భరోసాలో జరి గిన అవకతవకలపై అధికారులకు ఫిర్యాదుచేసినా నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. ఆ గ్రామంలో 160 మంది అర్హు లైన మత్స్యకారుల పేర్లు జాబితా నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

మంచినీళ్లపేటలో లబ్ధిదారుల తొలగింపుపై రేపు ధర్నా
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శీరిష
వజ్రపుకొత్తూరు, డిసెంబరు 10: మంచినీళ్లపేటలో మత్స్యకార భరోసాలో జరిగిన అవకతవకలపై అధికారులకు ఫిర్యాదుచేసినా నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. ఆ గ్రామంలో 160 మంది అర్హు లైన మత్స్యకారుల పేర్లు జాబితా నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేర కు గురువారం తహసీల్దార్ అప్పలస్వామికి వినతిపత్రం అందజేశారు. అనంతరం శిరీష విలేకరులతో మాట్లాడారు. వజ్రపుకొత్తూరులో శనివారం లబ్ధిదారులతో కలిసి ధర్నా చేస్తామన్నారు. గతనెల 28న మంచినీళ్లపేటలో భరోసా కోల్పోయిన లబ్ధిదారు లతో సమవేశం నిర్వహించి రెండువారాల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులకు కోరినా, వారిలో స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటికే తహసీల్దార్, ఎంపీడీవో కార్యా లయాల్లో, గతనెల 20న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌తో కలిసి జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేశా మని తెలిపారు. మంచినీళ్ళపేటతో పాటు పలుగ్రామాల్లో మత్స్యకార భరోసా ఎంపికలో అవకతవకలు జరిగాయని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు, ఆకుల పాపారావు, బి.శశిభూషణ్ పాల్గొన్నారు.