ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

ABN , First Publish Date - 2020-08-16T12:05:03+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

కలెక్టరేట్‌, గుజరాతిపేట, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి-సంక్షేమంపై ఆయా శాఖలు తయారుచేసిన శకటాలను ప్రదర్శించారు. వైద్య, ఆ రోగ్యం, రవా ణా, విద్య, ఆర్‌డబ్ల్యూఎస్‌, జలవనరులు, గృహ నిర్మాణం, ఉపాధి హామీ, అటవీ శాఖ, వ్యవసాయ, పౌర సరఫరాలు, ఐటీడీఏ, పంచాయతీరాజ్‌ తదితర 13 శాఖల శకటాలను ప్రదర్శించగా ఉత్తమ శకటాలకు బహుమతులు అందజేశారు. ఆర్‌డబ్యూఎస్‌కు (ప్రథమ),  పౌరసరఫరాల శాఖ (ద్వితీయ), సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) (తృతీయ) బహుమతులు పొందగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) శకటానికి కన్సోలేషన్‌ బహుమతి అందింది. 


స్టాళ్లను పరిశీలించిన ఇన్‌చార్జి మంత్రి కొడాలి

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి, వస్తువుల తయారీ, లబ్ధిదారులకు అందిస్తున్న సేవలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఇన్‌చార్జి మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్‌, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్యం, మత్స్య, వ్యవసాయ, ఐటీడీఏ, డీఆర్‌డీఏ, ఉద్యాన వన శాఖ, సూ క్ష్మ నీటి పారుదల, ఐసీడీఎస్‌ తదితర 11 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.  డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం కింద జిల్లాలోని 2,322 స్వయంశక్తి సంఘా లకు బ్యాంకు లింకేజీ కింద రూ.92 కోట్ల 1 లక్షా, 31  చెక్‌ను, బీసీ కార్పొ రేషన్‌ ద్వారా రాయితీపై ట్రాక్టరను మంత్రి నాని లబ్ధిదారులకు అందించారు.  

 

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు 

జిల్లా విద్యాశాఖ, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ‘భరత ఖండమే నా దేశం, భారత జాతి ముద్దు బిడ్డ లు’  అనే పాటలకు డాక్టర్‌ తిమ్మరాజు నీరజా సుబ్రహ్మ ణ్యం శిష్య బృందం చేసి న నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటకు శివ శిష్య బృందం, ‘నమో నమో భారతాంబే’ పాటకు పరిమళ శిష్య బృందం చేసిన నృత్యాలు అలరించాయి. పొన్నాడ కేజీబీవీ విద్యార్థినుల నృత్య ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. మంత్రులు కొడాలి నాని, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు వి.కళావతి, కంబాల జోగులు, కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తదితరులు తిలకిం పురస్కారాలు అందజేశారు.


ఆకట్టుకున్న కొవిడ్‌ చైతన్య ప్రదర్శన 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలాస ప్రాంతానికి చెందిన ఉపాధి హామీ కార్మికులు కొవిడ్‌ నిబంధనలపై చైతన్యం కోస చేసిన ప్రద ర్శన ఆకట్టుకుంది. భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకో వా లని, పరిశుభ్రత పాటించాలని, పనిలేకుండా బ యటకు రాకూడదని సూచిస్తూ హావభావాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులను అతిథులు అభినందించారు.

Updated Date - 2020-08-16T12:05:03+05:30 IST