బీమా లబ్ధిదారుల వివరాలు పక్కాగా ఉండాలి
ABN , First Publish Date - 2020-12-21T04:51:58+05:30 IST
వైఎస్‌ఆర్ బీమా లబ్ధిదారుల వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆదివారం ఎచ్చెర్ల టీటీడీసీలో నిర్వహిస్తున్న లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. వలంటీర్ల ద్వారా సేకరించిన లబ్ధిదారుల వయసు, ఆధార్, తదితర వివరాలు సరిగా ఉన్నాయో? లేదో చూడాలని సిబ్బందికి సూచించారు. సచివాలయాల వారీగా లబ్ధిదారుల వివరాలను అప్‌లోడ్ చేయాలన్నారు.

కలెక్టర్ నివాస్
ఎచ్చెర్ల, డిసెంబరు 20: వైఎస్‌ఆర్ బీమా లబ్ధిదారుల వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆదివారం ఎచ్చెర్ల టీటీడీసీలో నిర్వహిస్తున్న లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. వలంటీర్ల ద్వారా సేకరించిన లబ్ధిదారుల వయసు, ఆధార్, తదితర వివరాలు సరిగా ఉన్నాయో? లేదో చూడాలని సిబ్బందికి సూచించారు. సచివాలయాల వారీగా లబ్ధిదారుల వివరాలను అప్‌లోడ్ చేయాలన్నారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించుకొని ముందుకు సాగాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా పక్రియ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ, ఏవో దొర, ఎల్‌డీఎం ప్రసాద్, డీపీఎంలు ఆర్‌వీ రమణ, సీహెచ్.రామ్మోహనరావు, ఏరియా కోఆర్డినేటర్లు గౌరి, శ్రీరాములు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల్లో ముందుండాలి
ప్రతిఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంబాద్‌లో సైనికోద్యోగుల సంఘం భవనం, గ్రంథాలయాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సైనికోద్యోగులు సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉండడం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ కమాండెంట్ జేసీ పండా, డీఎస్పీ ప్రసాద్, తహసీల్దార్ ఎస్.సుధాసాగర్, ఎస్‌ఐ రాజేష్, మాజీ సైనికోద్యోగ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.