అధ్యాపకుడి మృతి
ABN , First Publish Date - 2020-09-12T11:27:03+05:30 IST
ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ ఇంజినీరింగ్ విభాగంలో టైం స్కేల్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కొల్లా సన్యాసిరావు(49) అ

ఆమదాలవలస : ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ ఇంజినీరింగ్ విభాగంలో టైం స్కేల్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కొల్లా సన్యాసిరావు(49) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. సన్యాసిరావు గత 20 ఏళ్లుగా అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య స్వప్న, ఓ కుమారుడు ఉన్నారు. పట్టణంలోని చంద్రయ్య పేటలో నివాసం ఉంటున్నారు. స్వగ్రామం విజయనగరం జిల్లా పాచిపెంట గ్రామం. సన్యాసిరావు మృతికి కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు సంతాపం తెలిపారు.