-
-
Home » Andhra Pradesh » Srikakulam » The boundary lines are Bandh
-
సరిహద్దు దారులు బంద్
ABN , First Publish Date - 2020-03-24T07:47:52+05:30 IST
కరోనా వైరస్ సోకకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలను సోమవారం మూసివేశారు. భామిని

భామిని/మెళియాపుట్టి/పాతపట్నం, మార్చి 23: కరోనా వైరస్ సోకకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలను సోమవారం మూసివేశారు. భామిని మండలంలో బత్తిలి సమీపంలో చెక్‌గేట్‌ను ఏర్పాటు చేసి ద్విచక్రవాహనాలను సైతం ఇతర రాష్ర్టాలకు రాకపోకలు జరగకుండా బత్తిలి ఎస్‌ఐ మహమ్మద్ అజాద్ అహ్మద్ ఆధ్వర్యంలో పోలీసులు నిలువరిస్తున్నారు.
అలాగే చత్తీస్‌ఘడ్, ఒడిశా నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగించగా వాటిని సరిహద్దుల్లో నిలువరించారు. ఈనెల 31వ తేదీ వరకు ఎటువంటి వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వసుందర, పాతపట్నం, గోప్పిలి, కొత్తూరు, జంగలపాడువంటి సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. అదేవిధంగా పాతపట్నంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలను నిలుపుదల చేస్తూ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. దీంతో ఇరు రాష్ట్రాలమధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.