‘కాకరాపల్లి’ఉద్యమం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2020-02-29T09:16:02+05:30 IST

జీవన మనుగడ కోసం మత్స్య కారులు, రైతులు చేసిన కాకరాపల్లి ఉద్యమం దేశానికే ఆదర్శమని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, టెక్కలి

‘కాకరాపల్లి’ఉద్యమం దేశానికే ఆదర్శం

పోతునాయుడుపేట (సంతబొమ్మాళి) ఫిబ్రవరి 28: జీవన మనుగడ కోసం మత్స్య కారులు, రైతులు చేసిన కాకరాపల్లి ఉద్యమం దేశానికే ఆదర్శమని  వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, టెక్కలి నియోజకవర్గ సమన్వ యకర్త పేరాడ తిలక్‌ అన్నారు. ఈమేరకు  శు క్రవారం పోతునాయుడుపేటలో కాకరాపల్లి   థర్మల్‌ వ్యతిరేక ఉద్యమంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఉద్యమంలో అమరులకు ముఖ్య అథితులుగా పాల్గొన్న   డా.కృపా రాణి,  తిలక్‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమకారులతో కలసి  వైసీపీ పోరాటం చేసిందన్నారు.  సీఎం జగన్మోహన రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో మ త్స్యకారులకు  ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్నారు. 


ఈస్ట్‌కోస్టు థర్మల్‌ ప్లాంట్‌కు సంబంధించిన జీవో 1108 రద్దు, తంపర మత్స్యకారు లకు లీజు, ఉద్యమకారులపై  కేసులు ఎత్తివేయడంతో పాటు తంపరలో అక్ర మ రొయ్యల చెరువులను తొలగిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. కాకరాపల్లి  ఉద్యమంలో అసువులు బాసిన జీరు నాగే శ్వరావు, సీరపు ఎర్రయ్య, బత్తిన బారికవాడు లకు జోహోర్లు  అర్పించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు తాండ్ర ప్రకాశ్‌, మండపాక నర్సింగరావు, కారుణ్య ఖత్రో, బుడ్డా మోహనరెడ్డి, పాల వసం తరెడ్డి, పాల మహేశ్‌, సూరాడ రాజారావు తదితరులు  ఉన్నారు.

Updated Date - 2020-02-29T09:16:02+05:30 IST