పీటీడీలో తాత్కాలిక డ్రైవర్ల నియామకం
ABN , First Publish Date - 2020-11-27T05:24:44+05:30 IST
ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖ రీజియన్ యా జమాన్యం 70 మంది తాత్కాలిక డ్రైవర్లను నియమించింది. ఆన్‌కాల్ డ్రైవర్స్ పేరిట వీరికి రోజువారీ వేతనంపై విధులు అప్పగించింది.

ద్వారకాబస్‌స్టేషన్: ప్రజారవాణాశాఖ (పీటీడీ) విశాఖ రీజియన్ యా జమాన్యం 70 మంది తాత్కాలిక డ్రైవర్లను నియమించింది. ఆన్‌కాల్ డ్రైవర్స్ పేరిట వీరికి రోజువారీ వేతనంపై విధులు అప్పగించింది. రీజియన్‌లోని మధురవాడ, వాల్తేరు, మద్దిలపాలెం, గాజువాక, సింహాచలం, స్టీల్‌సిటీ, విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం డిపోల్లో 117 మంది డ్రైవర్ల కొరత ఉంది. కార్తీకమాసం కావడంతో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉం చుకుని పీటీడీలో డ్రైవర్లుగా పనిచేసి, వివిధ కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన, 60 ఏళ్ల లోపున్న వారికి, అర్హతలున్న అద్దెబస్సుల డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రాథమికంగా 70 మందికి తాత్కాలిక డ్రైవర్లుగా బాధ్యతలు అప్పగించారు. మరింత మందిని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నామని అధికారులు తెలిపారు.