వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించండి

ABN , First Publish Date - 2020-12-17T05:45:49+05:30 IST

పాలకొండ నగరపంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి సామీ పథకం ద్వారా పేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, జిల్లా అధ్యక్షుడు చర్ల ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించండి
పాలకొండలోని ఽధర్నాచేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు


ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌
పాలకొండ:
పాలకొండ నగరపంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి సామీ పథకం ద్వారా పేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ, జిల్లా అధ్యక్షుడు చర్ల ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.బుధవారం పాలకొండలోని ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద  ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. ఇక్కడ సుమారు రెండువేల జాబ్‌కార్డులు ఉన్నప్పటికి పనులు కల్పించకపోవడంతో కూలీలు వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అనంతరం ఏపీవో రౌతు విద్యాసాగర్‌కు వినితిపత్రం అం దజేశారు.  కార్యక్రమంలో రమ, రమణమ్మ, కృష్ణ, ఎల్లమ్మ, పార్వతి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T05:45:49+05:30 IST