సాగర్‌ బాబు నియామకంపై హర్షం

ABN , First Publish Date - 2020-11-07T05:05:24+05:30 IST

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి తన యుడు సాగర్‌బాబు నియామకంపై కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తంచేశారు.

సాగర్‌ బాబు నియామకంపై హర్షం
సాగర్‌బాబుకు మిఠాయి తినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ


పాతపట్నం: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి తనయుడు సాగర్‌బాబు నియామకంపై కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తంచేశారు. సాగర్‌బాబు నియామకంతో నియోజకవర్గానికి గుర్తింపు లభించిందన్నారు. సాగర్‌బాబును నాయకులు పైల లచ్చుమయ్య, శివాల చిన్నయ్య, దువ్వారి ఉదయభాస్కర్‌, పైల బాబ్జి, పడాల తిరుపతిరావు, మిరియాబిల్లి బాబూరావు, కనకల నారా యణ, నల్లి లక్ష్మణ, ఎస్‌.బుల్లిబాబు అభినందించారు.

నాయకుల హర్షం

 మెళియాపుట్టి/కొత్తూరురూరల్‌: టీడీపీ రాష్ట్రకమిటీలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమారుడు, యువనేత సాగర్‌బాబుకు  ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై నాయకులు, కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాగర్‌బాబు ఎంపికపై పార్టీ నాయకులు సలా న మోహనరావు, బి.పరమేష్‌రెడ్డి, భాస్కర్‌ గౌడో, సిలార్‌, లలితకుమారి తదితరులు హర్షం వ్యక్తంచేసి అభినందించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా ఎంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సాగర్‌ పేర్కొన్నారు. సాగర్‌ను తండ్రి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తదితరులు అభినందించారు.

  


Updated Date - 2020-11-07T05:05:24+05:30 IST