టీడీపీ పూర్వ వైభవానికి కృషి

ABN , First Publish Date - 2020-11-08T05:13:57+05:30 IST

టీడీపీ పూర్వ వైభవానికి శ్రేణులు కృషిచేయాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు అన్నారు.

టీడీపీ పూర్వ వైభవానికి కృషి
కళాను కలిసిన టీడీపీ నాయకులురాజాం, నవంబరు 7: టీడీపీ పూర్వ వైభవానికి శ్రేణులు కృషిచేయాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం టీడీపీ కార్యకర్తలు, నాయకులు కళాను కలిశారు. పార్టీ బలోపేతానికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కళా మాట్లాడుతూ పార్టీలో యువత, మహిళలు, అన్నివర్గాలకు ప్రాధాన్యమిస్తుండడం శుభసూచికమన్నారు. గ్రామాల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కళాను కలిసిన వారిలో మక్కా నారాయణరావు, మీసాల రమణ, డోల పార్వతి, ఎం.సత్యసాయిరాం, ఎం.ఉమామహేశ్వరరావు, ఎం.గిరి, సత్యానారాయణ, కె.రమణ, ఎం.సంతుబాబు ఉన్నారు.


Updated Date - 2020-11-08T05:13:57+05:30 IST