ప్రజాస్వామ్యంలో చీకటిరోజు

ABN , First Publish Date - 2020-08-01T10:23:45+05:30 IST

మూడు రాజధానులకు ఆమోదం తెలుపుతూ గవర్నర్‌ సంతకం పెట్టడం నిజంగా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఒక ..

ప్రజాస్వామ్యంలో చీకటిరోజు

న్యాయస్థానాల ద్వారానే అమరావతిని సాధించుకుంటాం

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీష


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 31 : మూడు రాజధానులకు ఆమోదం తెలుపుతూ గవర్నర్‌ సంతకం పెట్టడం నిజంగా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఒక చీకటిరోజుగా భావిస్తున్నామని టీడీపీ  జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం రాత్రి ప్రత్యేక ప్రకటన విడుదుల చేశారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకోవాలి కానీ... ఇలా ప్రజావ్యతిరేక  నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వా మ్యానికే మచ్చ అని అభివర్ణించారు. ప్రజల ఇష్టాలతో పని లేకుండానే గవర్నర్‌ చేత సంతకం పెట్టించడమన్నది ఎన్నడూ ఊహించలేని పరిణామయని పేర్కొన్నారు.  కరోనా నియమ నిబంధనలు ప్రకారం లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉన్న సమయంలో ఇలా ఆమోదింప జేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఇటువంటి సమయంలో రెండు బిల్లులపై గవర్నర్‌ సంతకం పెట్టడంపై ప్రజలు క్షమించరని  అన్నారు. అయినప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు మీద  మాకు నమ్మకం ఉందని  పేర్కొన్నారు.


ఈ విషయంలో కూడా ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరిం చారు. ఇప్పటికే రెండు బిల్లులపై ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్‌లు విచారణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం లక్ష్య పెట్టకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.  ఇటువంటి దొంగచాటు పనుల వల్ల ప్రభు త్వంపై  ప్రజలకు నమ్మకం, గౌరవం కోల్పోయిందన్నారు. దీనిపై ప్రజలు నిరసనలు తెలియజేయాలని ఆమె కోరారు.  

Updated Date - 2020-08-01T10:23:45+05:30 IST