టీడీపీలో జోష్‌!

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

టీడీపీ అధిష్ఠానం.. పార్టీ పదవుల కేటాయింపులో మరోసారి సిక్కోలు ప్రత్యేకత నిలబెట్టుకుంది. టీడీపీ పదవుల్లో ఆది నుంచీ సిక్కోలుకు ప్రాముఖ్యం కల్పిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి దగ్గర నుంచి పొలిట్‌బ్యూరో సభ్యత్వం వరకు వివిధ కీలక పదవులతో జిల్లాకు సముచిత స్థానం దక్కింది. తాజాగా రాష్ట్ర కమిటీల్లో కూడా ప్రాధాన్యం కల్పించింది. ఈసారి యువతకు పెద్దపీట వేసింది. కుటుంబ నేపథ్యం, పార్టీకి అందించిన సేవలు గుర్తిస్తూ, సామాజిక సమతూకం పాటిస్తూ.. నియామకాలు చేపట్టింది. దీంతో జిల్లా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అధినేత చంద్రబాబునాయుడు జిల్లాకు కీలక పదవులు కట్టబెట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది.

టీడీపీలో జోష్‌!

రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో జిల్లాకు సముచిత స్థానం

సామాజిక సమతూకంలో పదవుల కేటాయింపు 

సేవలకు గుర్తింపు.. యువతకు పెద్దపీట

తెలుగు తమ్ముళ్లలో హర్షాతిరేకాలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

టీడీపీ అధిష్ఠానం.. పార్టీ పదవుల కేటాయింపులో మరోసారి సిక్కోలు ప్రత్యేకత నిలబెట్టుకుంది. టీడీపీ పదవుల్లో ఆది నుంచీ సిక్కోలుకు ప్రాముఖ్యం కల్పిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి దగ్గర నుంచి పొలిట్‌బ్యూరో సభ్యత్వం వరకు వివిధ కీలక పదవులతో జిల్లాకు సముచిత స్థానం దక్కింది. తాజాగా రాష్ట్ర కమిటీల్లో కూడా ప్రాధాన్యం కల్పించింది. ఈసారి యువతకు పెద్దపీట వేసింది. కుటుంబ నేపథ్యం, పార్టీకి అందించిన సేవలు గుర్తిస్తూ, సామాజిక సమతూకం పాటిస్తూ.. నియామకాలు చేపట్టింది. దీంతో జిల్లా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అధినేత చంద్రబాబునాయుడు జిల్లాకు కీలక పదవులు కట్టబెట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది. 

------------------------

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే చాలామందికి పార్టీలో కీలక పదవులను కేటాయించింది. తాజాగా రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శుల నియామకాలు చేపట్టింది. ఇందులో జిల్లాకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ.. సుమారు 12 మందికి పదవులు కేటాయించింది. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఫుల్‌ జోష్‌ కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ పదవులు కట్టబెట్టడంలో జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించడంపై పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత నేత ఎన్టీఆర్‌, అధినేత చంద్రబాబునాయుడు తర్వాత టీడీపీ రాష్ట్ర పగ్గాలు జిల్లాకు రెండుసార్లు దక్కాయి. జిల్లాకు చెందిన కిమిడి కళా వెంకటరావు మొన్నటి వరకూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఇటీవల ఆయన్ను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడుని నియమించిన సంగతి తెలిసిందే. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకి మరోసారి బాధ్యతలు అప్పగించారు. మాజీ స్పీకర్‌, సీనియర్‌ నాయకురాలు కావలి ప్రతిభాభారతిని జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఇలా జిల్లాకు నాలుగు కీలక పదవులు లభించాయి. ఇటీవల పార్లమెంటరీ స్థానానికి కొత్త అధ్యక్షుడిగా సీనియర్‌ నేత, మాజీ విప్‌ కూన రవికుమార్‌ను నియమించారు. తాజాగా రాష్ట్ర కమిటీలో మరి కొంతమందికి చోటు కల్పించారు. సామాజిక వర్గ సమీకరణలు, సమతుల్యం పాటిస్తూ యువ నేతలకు సైతం పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చారు. 

రాష్ట్ర కమిటీలో పదవులు ఇలా...

టీడీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన సుమారు 12 మందికి పదవులు దక్కాయి. టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగిన గౌతు శిరీషను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సీనియర్‌ నేత గౌతు శ్యామసుందర్‌శివాజీ కుమార్తె అయిన ఆమెకు.. జిల్లాలో పార్టీ సీనియర్‌ మహిళా నేతగా గుర్తింపు ఉంది. 

- రాజాం ప్రాంతానికి చెందిన కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడుకు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా స్థానం దక్కింది. ఆయనతో పాటు మరో యువనేత పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమారుడు సాగర్‌ బాబు, ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన సాలిన ఢిల్లీరావు, సురాడ చంద్రమోహన్‌, ఆమదాలవలసకు చెందిన సివ్వాల సూర్యనారాయణ, బోనెల అప్పారావు, టెక్కలికి చెందిన బోయిన గోవిందరాజులు, నరసన్నపేటకు చెందిన కిల్లి వేణుగోపాలస్వామి, పాలకొండకు చెందిన కర్నేని అప్పలనాయుడులను రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా నియమించారు. కర్నేని రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా రెండోసారి నియమితులయ్యారు. 

- రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా టెక్కలికి చెందిన సీనియర్‌ నేత ఎల్‌.ఎల్‌.నాయుడు, రాజాంకు చెందిన కోళ్ల అప్పలనాయుడులకు అవకాశం కల్పించారు. 

ఇలా.. జిల్లాలో ఇంతమందికి కీలక పదవులు లభించడంతో.. పార్టీ బలోపేతానికి ఇది శుభసూచకమని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. అన్ని వర్గాలకూ సమప్రాధాన్యం కల్పించడంతో పాటు రాష్ట్ర కమిటీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST