వరి సాగుపై శ్రద్ధ వహించండి

ABN , First Publish Date - 2020-08-18T11:24:21+05:30 IST

వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగుపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి.వెంక టరావు, ఎఆర్‌ఎస్‌ ఆమదాలవలస శాస్త్రవేత్త ఎల్‌.సూర్య నారాయ

వరి సాగుపై  శ్రద్ధ వహించండి

బొడ్డపాడు (పలాస రూరల్‌) ఆగస్టు 17:  వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగుపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి.వెంక టరావు, ఎఆర్‌ఎస్‌ ఆమదాలవలస శాస్త్రవేత్త ఎల్‌.సూర్య నారాయణ సూచించారు. బొడ్డపాడు గ్రామంలో వరినారును సోమవారం పరిశీలించారు.  ఏడీఏ ఎల్‌వీ మధు,  ఏవో నాగరాజు పాల్గొన్నారు.


ఈ-క్రాప్‌ నమోదు తప్పనిసరి

ఎల్‌.ఎన్‌.పేట: అన్ని గ్రామాల్లో రైతులకు సంబంధించిన పంట పొలాలకు ఈక్రాప్‌ నమోదు తప్పనిసరని వ్యవసాయాధికారి పి.లతాశ్రీ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం గ్రామ సచి వాలయ వ్యసాయశాఖ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  అలాగే ఉడుపులు, వరి ఎదల్లో కాలిబాటలు తీసేలా అవగాహన కలిగించాలన్నారు.  


మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు 

రేగిడి: వ్యవసాయం సాగులో ఎరువులను మోతాదుకు మించి వాడితే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని  ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు  రాజశేఖరం, అమరజ్యోతి అన్నారు. సోమవారం  బూరాడ, ఉణుకూరు, చిన్నశిర్లాం గ్రామాల్లో పర్యటించి మొక్కజొన్న, వరి పైర్లను పరిశీలించారు. నీటి యాజమాన్య పద్ధతులను అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో మురళీకృష్ణ, ఏఈవో లీలామోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-18T11:24:21+05:30 IST