ఐదో షెడ్యూల్‌లో చేర్పించడంపై సర్వే

ABN , First Publish Date - 2020-12-20T05:13:54+05:30 IST

గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్పించడానికి ఇప్పటికే సర్వే చేపట్టామని, మిగిలి ఉన్న గ్రామాల జాబితాను సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో సీహెచ్‌ శ్రీధర్‌, ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి కోరారు.

ఐదో షెడ్యూల్‌లో చేర్పించడంపై సర్వే
మాట్లాడుతున్న కళావతి


మిగిలిన గ్రామాల జాబితా సిద్ధం చేయండి: ఎమ్మెల్యే

సీతంపేట:గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్పించడానికి ఇప్పటికే సర్వే చేపట్టామని, మిగిలి ఉన్న గ్రామాల జాబితాను సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో సీహెచ్‌ శ్రీధర్‌, ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి కోరారు. శనివారం ఐటీడీఏ ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని గిరిజన సంఘ ప్రతినిధులు, రెవెన్యూ అధి కారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మా ట్లాడుతూ  గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోనున్నట్లు తెలిపారు.ఐదో షెడ్యూల్‌ గ్రామాల జాబితాను పూర్తి స్థాయిలో తయారు చేసి  నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. కాగా గతంలో ఐటీడీఏ పరిధిలో ఉన్న అన్ని గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరామని, ఈ మేరకు సర్వే నిర్వహించి కొన్ని గిరిజన గ్రామాలను పొందుపరచలేదని, ప్రస్తుతం అటువంటి గ్రామాలను కూడా చేర్చాలని గిరిజన సంఘ ప్రతినిధులు కోరారు. గవర్నర్‌కు జీవో- 3పై లేక రాసి, గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్‌చేశారు. ఆశ్రమ, జీపీఎస్‌ పాఠశాలల్లో గిరిజన నిరుద్యోగ అభ్యర్థులతో స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, నకిలీ బెంతు ఒరియాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసు వేయడానికి అయ్యే ఖర్చులు సీతంపేట ఐటీడీఏ లీగల్‌ ఫండ్స్‌ నుంచి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. ఎస్టీ ధ్రువపత్రాలతో ఉద్యోగం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో పాలకొండ ఆర్డీవో టీవీజీఎస్‌.కుమార్‌, గిరిజన సంఘ ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు బిడ్డిక తేజేశ్వరరావు, వాబ యోగేశ్వరరావు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-20T05:13:54+05:30 IST