మొగిలివలసలో ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-29T05:17:19+05:30 IST

మొగిలివలస గ్రామానికి చెందిన వారణాశి కాంతారావు సోమవారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన కాంతారావు ఆ మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మొగిలివలసలో ఒకరి ఆత్మహత్య

రాజాం రూరల్‌ : మొగిలివలస గ్రామానికి చెందిన వారణాశి కాంతారావు సోమవారం తెల్లవారు జామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసైన కాంతారావు ఆ మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాంతారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  భార్య లీలావతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జోగారావు కేసు నమోదు చేశారు.

ఎలుకల నివారణకు పెట్టిన స్వీట్‌ తిని మరొకరు...

రాజాం నగర పంచాయతీ పరిధిలోని మడ్డువలస కాలనీకి చెందిన రిజర్వా యర్‌ ఉద్యోగి పారిశర్ల స్వామినాయుడు ఎలుకల నివారణకు వినియోగించిన స్వీట్‌ తిని మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... ఇంట్లో ఎలుకల నివారణ కోసం స్వీట్‌పై మందు వేశారు. పొరపాటున ఆ స్వీట్‌ను ఆయన తినడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆదివారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వామి నాయుడు కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రేవతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తా... ఆరుగురికి గాయాలు

రాజాం రూరల్‌ : రాజాం-బొబ్బిలి రోడ్డులోని వస్త్రపురికాలనీ సమీపంలో సో మవారం రాత్రి ఆటో బోల్తాపడడంతో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రాజాం నుంచి కంచరాం వైపు వెళ్తున్న ఆటో ఎదురు గా కలపతో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో కంచరాం గ్రామా నికి చెందిన బోడసింగి అప్పలనాయుడు,లక్ష్మణ, ముత్యాల పవన్‌తో పాటు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాళి, గదబవలస గ్రామాలకు చెందిన వారు గాయపడ్డారు. రాజాం పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-12-29T05:17:19+05:30 IST