మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-15T06:21:32+05:30 IST

మర్లపాడుకు చెందిన బతకల లోకనాథం(30)మనస్తాపంతో సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

నందిగాం : మర్లపాడుకు చెందిన బతకల లోకనాథం(30)మనస్తాపంతో సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం మేరకు.. .లోకనాఽథం మద్యానికి బానిసై ఇబ్బంది పెడుతుండడంపై ఆదివారం రాత్రి కుటుంబసభ్యులు నిలదీశారు. దీంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. భార్య కౌసల్య ఫిర్యాదుతో ఏఎస్‌ఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-12-15T06:21:32+05:30 IST