-
-
Home » Andhra Pradesh » Srikakulam » success the farmers strike
-
రైతుల బంద్‌ను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2020-12-07T05:08:01+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతరేకంగా రైతన్నలు మంగళవారం తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఏ.గఫూర్ పిలుపునిచ్చారు.

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 6: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతరేకంగా రైతన్నలు మంగళవారం తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఏ.గఫూర్ పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా చేస్తున్న పోరాటంలో రైతులపై దాడులు చేయడం దారుణమన్నారు.
రైతుల బంద్‌కు టీడీపీ మద్దతు
కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మంగళవారం తలపెట్టిన భారత్ బంద్‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ప్రకటించారు. ఆదివారం కర్నూలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతు సంఘాల నాయకులు కె.జగన్నాథం, రామక్రిష్ణ, శేషఫణి తదితరులు ఆయనను కలిసి 8న రైతులు చేపట్టిన దేశవ్యాప్త బంద్‌కు మద్దతు ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిర వ్యవసాయ బిల్లుల వల్ల రైతులను కార్పొరేట్ శక్తులు నిలువునా దోచుకుంటాయని అన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి జేమ్స్, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంవీఎస్ రాజు యాదవ్, బజారన్న పాల్గొన్నారు.
కర్నూలు(ఎడ్యుకేషన్): నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన దేశ వ్యాప్త ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు హెచ్.తిమ్మన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గోకారి తెలిపారు. ఆదివారం సలాంఖాన్ ఎస్టీయూ భవనంలో డా.బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సభ జిల్లా కార్యదర్శి గోకారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు రోడ్ల మీద ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదని అన్నారు. కార్యక్రమంలో వైవీ భాస్కర్, నాగరాజు, శివనాగిరెడ్డి, వైవీ రాముడు, సుధాకర్ బాబు, కేసీహెచ్ పాలయ్య పాల్గొన్నారు.
రైతుల భారత్ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ప్రకటించాయి. ఈ సమావేశంలో ఏఐఎ్‌సఎఫ్, ఎస్‌ఎ్‌ఫఐ, పీడీఎ్‌సయూ శ్రీరాములుగౌడు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, భాస్కర్, నగేష్ పాల్గొన్నారు.