ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి షష్టి
ABN , First Publish Date - 2020-12-21T05:03:08+05:30 IST
సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హడ్కో కాలనీ, పెద్దపేటలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక హోమం, అభిషేకాలు చేపట్టారు.

నరసన్నపేట: సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హడ్కో కాలనీ, పెద్దపేటలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక హోమం, అభిషేకాలు చేపట్టారు. అయ్యప్ప దేవాల యంలో అయ్యప్ప భక్తులు ప్రత్యేక పూజలను జరిపించారు. సుబ్రహ్మణ్యస్వామి కావడిలతో నరసన్నపేటలో ఉరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. టెక్కలి రూరల్: సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా పట్టు మహాదేవి కోనేరు గట్టుపై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సుబ్రహ్మణ్య షడావర్ణార్చన నిర్వహించారు. ఆలయ అర్చకుడు తర్లా శివకుమార్ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాజాం: కంచరాం పూర్ణపుష్కలాంబ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం సుబ్ర హ్మణేశ్వర స్వామి షష్టి సందర్భంగా ఆవర్ణార్చన నిర్వహించారు అర్చకుడు మాపు డూరి చంద్రశేఖర్ శర్మ వేదమంత్రాల నడుమ ఆలయ ధర్మకర్త టంకాల పాపినా యుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం స్వామిని మేళతాళాలతో ఊరేగించారు. సారధి గ్రామంలో సుబ్రహ్మణ్య షష్టి సందర్బంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: పట్టణంలోని ఆలయాల్లో సుబ్రహ్మణ్యస్వామి షష్టి మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్థానిక స్వేచ్ఛావతి, కన్యకాపరమేశ్వరి, బాహుదానదీ తీరంలో కొలువైన అయ్యప్పస్వామి ఆలయాల్లో సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలుచేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం చేశారు. కొత్తూరు: స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి పూజలు నిర్వహించారు. ప్రసాదరావు గురుస్వామి, మహసింగి వద్ద చింద్రాడ భాస్కరరావు గురుస్వామి, చిట్టి పంతులు అభిషేకాలు జరిపించారు.