-
-
Home » Andhra Pradesh » Srikakulam » Students need to do justice
-
విద్యార్థులకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2020-12-31T05:21:02+05:30 IST
అంబేడ్కర్ యూనివర్సిటీలో స్పెషల్ బీఈడీ, ఎంసీఏ విద్యార్థు లకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాం డ్ చేశారు.

ఎచ్చెర్ల: అంబేడ్కర్ యూనివర్సిటీలో స్పెషల్ బీఈడీ, ఎంసీఏ విద్యార్థు లకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాం డ్ చేశారు. ఈ మేరకు వర్సిటీ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. వర్సిటీ అధికారుల తప్పిదంతో స్పెషల్ బీఈడీ, ఎంసీఏ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఇప్పటి వరకు మంజూరు కాలేదన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.రఘుబా బుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బూరె నరేంద్ర చక్రవర్తి, వర్సిటీ ఏబీవీపీ ఇన్‌చార్జి వెంగోటి పులిరాజు, మధు, ప్రశాంత్, పద్మ, హరీష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.