ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-29T05:15:58+05:30 IST

ఏపీ ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం నగరానికి సమీపాన కుశాలపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు వివిధ సమస్యలతో 70మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1 నుంచి 60 వేల లోపు ర్యాంకు వచ్చిన వారు సోమ, మంగళవారాల్లో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న అభ్యర్థులు

ఎచ్చెర్ల, డిసెంబరు 28: ఏపీ ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం నగరానికి సమీపాన కుశాలపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు వివిధ సమస్యలతో 70మంది  అభ్యర్థులు హాజరయ్యారు. 1 నుంచి 60 వేల లోపు ర్యాంకు వచ్చిన వారు సోమ, మంగళవారాల్లో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 60,001 నుంచి చివరి ర్యాంకు వరకు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 30, 31 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ సీట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ(ఎచ్చెర్ల)లో 198, శివానీ ఇంజినీరింగ్‌ కళాశాల (చిలకపాలెం)లో 253, వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల(ఎచ్చెర్ల)లో 253, జీఎంఆర్‌ ఐటీ (రాజాం)లో 716, ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (టెక్కలి)లో 693 చొప్పున కన్వీనర్‌ కోటాలో ఉన్నాయి. అంబేడ్కర్‌ వర్సిటీ, శివానీ, వెంకటేశ్వర కళాశాలల్లో ఫీజు రూ.35 వేలు, జీఎంఆర్‌ ఐటీలో రూ.66,000, ఆదిత్యలో రూ.61,200 చొప్పున ఫీజులు నిర్ణయించారు. ఫార్మసీ కోర్సుకు సంబంధించి వెంకటేశ్వర (ఎచ్చెర్ల)లో 38 సీట్లు ఉండగా, ఫీజు రూ.38 వేలు, శివానీలో 38 సీట్లు ఉండగా రూ.35 వేలుగా ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - 2020-12-29T05:15:58+05:30 IST