రేపటి నుంచి శ్రీవారి లడ్డూల విక్రయం

ABN , First Publish Date - 2020-05-24T08:43:33+05:30 IST

తిరుమల తిరుపతి వేంకటేశ్వ రుని లడ్డూలను సోమ వారం నుంచి విక్రయించనున్నారు.

రేపటి నుంచి శ్రీవారి లడ్డూల విక్రయం

శ్రీకాకుళం కల్చరల్‌: తిరుమల తిరుపతి వేంకటేశ్వ రుని లడ్డూలను సోమ వారం నుంచి విక్రయించనున్నారు. ఈ మేరకు జిల్లాకు టీటీడీ నుంచి ప్రత్యేక ప్రసాదరథంలో 10 వేల లడ్డూలు వచ్చినట్లు శ్రీకాకుళం టీటీడీ కల్యాణ మండ పం మేనేజర్‌ కిరణ్‌ తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌తో సుమారు రెండు నెలలుగా శ్రీవారి దర్శనం నిలిచిపోయిం ది. దీంతో భక్తులు నిరాశ చెందకుండా లడ్డూల విక్రయా నికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ లడ్డూలను శ్రీకాకుళం, సోంపేట, బూర్జ, రాజాం  టీటీడీ  కల్యాణ మండపాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విక్రయించనున్నట్లు చెప్పారు. 175 గ్రాముల లడ్డూ ధరను రూ.25గా నిర్ణయించినట్లు తెలిపారు. లడ్డూల కోసం వచ్చే వారు మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలన్నారు. 9849575952, 9701092777 నంబర్లను  సంపద్రించాలని కిరణ్‌ తెలిపారు.

Updated Date - 2020-05-24T08:43:33+05:30 IST