ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2020-10-07T15:36:14+05:30 IST

జిల్లాలోని పలాస మండలం నెమలినారాయణపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టిన కారు

శ్రీకాకుళం: జిల్లాలోని పలాస మండలం నెమలినారాయణపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి వెనుక నుండి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read more