బోసిపోయిన శ్రీకాకుళం రోడ్‌

ABN , First Publish Date - 2020-03-19T10:05:30+05:30 IST

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందు తుందన్న వార్తలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు వెలవెలబోతున్నాయి.

బోసిపోయిన శ్రీకాకుళం రోడ్‌

ఆమదాలవలస/రూరల్‌, మార్చి 18: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందు తుందన్న వార్తలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ బుధవారం ప్రయాణి కులు లేకపోవడంతో బోసిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంచరించవద్దని, తప్పనిసరి పరిస్థితిల్లోనే ప్రయాణాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీంతో రిజర్వేషన్‌, టిక్కెట్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు లేకపోవడంతో ఖాళీగా కనిపించింది. ప్లాట్‌ఫారంపై ప్రయాణికులు లేక బోసిపో యింది. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రైళ్లలో ప్రయాణించే ఇక్కడికి వచ్చే ప్రయాణి కులు సైతం తక్కువ సంఖ్యలో కనిపించారు. రైళ్లు వచ్చే సమయంలోనూ ప్రయాణికులు తక్కువగా ఉన్నారు.

Updated Date - 2020-03-19T10:05:30+05:30 IST