-
-
Home » Andhra Pradesh » Srikakulam » Special pujas at Srimukhalingam
-
శ్రీముఖలింగంలో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-12-07T04:44:48+05:30 IST
దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామిని పలువురు భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం 4వ ఆదివారం భక్తులు స్వామికి అభిషేకాలు చేశారు.

శ్రీముఖలింగం (జలుమూరు) డిసెంబరు 6: దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామిని పలువురు భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం 4వ ఆదివారం భక్తులు స్వామికి అభిషేకాలు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు జిల్లా నలుమూలల నుంచి కుటుంబాలతో పాటు తరలివచ్చారు. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులకు ఆలయ సిబ్బంది అనుమతించారు.
సంగాంలో..
వంగర: నదీ సంగమ ప్రదేశం సంగాంలో ఆదివారం సంగమేశ్వరస్వామిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. నాగావళి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ, అధికారులు ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వనభోజనాలు చేసి పిక్నిక్‌ను ఆనం దంగా చేపట్టారు. మడ్డువలస పరిసరాల్లోనూ పిక్నిక్ సందడి కనిపించింది.