పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-05-08T08:21:50+05:30 IST

పరిశ్రమల్లో భద్రతా చర్యలు పక్కాగా ఉండాలని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను

పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి

కలెక్టర్‌ జె. నివాస్‌


కలెక్టరేట్‌, మే 7 : పరిశ్రమల్లో భద్రతా చర్యలు పక్కాగా ఉండాలని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ బంగ్లాలో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పరిశ్రమల్లో భద్రతా ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలి. ప్రమాదకర రసాయనాలు   కలిగిన పరిశ్రమలను పరిశీలించి ప్రత్యేక దృష్టి సారించాలి. ఎ.బి.కర్మాగారాలు, ఇతర పరిశ్రమల పరిస్థితి పూర్తిస్థాయిలో చూడాలి. ఆల్కహాల్‌, బాయిలర్లు వంటి పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.


అగ్నిమాపక కోణంలో తనిఖీలు నిర్వహించాలి. భద్రత పాటించకపోతే చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల వద్ద మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. అగ్నిమాపక యంత్రాలు, ఫోమ్‌, నీటితో నియంత్రణ చేసే పరికాలు ఉంచాలి. ప్రమాదకర రసాయనాలు కలిగిన పరిశ్రమల పరిధిలో ఉన్న గ్రామాల ఆరోగ్య పరిస్థితులపై కూడా దృష్టి సారించాలి’ అని కలెక్టర్‌ ఆదేశించారు.  సమావేశంలో డీఐసీ జి.ఎం. బి.గోపాలకృష్ణ, డి.డి రవిశంకర్‌, కర్మాగారాల డిప్యూటీ చీఫ్‌న్‌స్పెక్టర్లు ప్రసన్న కుమార్‌, శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-08T08:21:50+05:30 IST