ఫభావనపాడు పోర్టును రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-10-31T09:02:57+05:30 IST

ప్రజా వినాశకర భావనపాడు పోర్టుని రద్దు చేయా లని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐఎఏఎంఎస్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌.

ఫభావనపాడు పోర్టును రద్దు చేయాలి

గుజరాతీపేట:ప్రజా వినాశకర భావనపాడు పోర్టుని రద్దు చేయా లని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐఎఏఎంఎస్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక క్రాంతి భవన్‌లో శుక్రవారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలు చిరకా లంగా కోరుతున్న ఫిషింగ్‌ హార్బర్‌, జట్టీలను మాత్రమే నిర్మించాలని కోరారు. అత్యంత ప్రమాదకర రసాయన పరిశ్రమలు, అణు, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లతో జిల్లాలో ప్రారంభమైన వినాశనానికి కొనసాగింపుగా ప్రభుత్వం గ్రీన్‌ ఫీల్డు పోర్టు పేరుతో భావనపాడు పోర్టు నిర్మాణానికి సిద్ధమైందని ఆరోపించారు. చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించి పోర్టు నిర్మాణానికి పూనుకుందన్నా రు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకప క్షంగా నిర్ణయం తీసుకుందన్నారు. రాజ కీయ అనుకూలురను పిలిచి వారితో మమ అనిపించేసి అదే ప్రజాభిప్రాయంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాల కోసం మాత్రమే పోర్టును నిర్మిస్తున్నారని ఆయన విమర్శించారు.

Read more