-
-
Home » Andhra Pradesh » Srikakulam » sklm news
-
అంబులెన్స్‌లో అక్రమ రవాణా
ABN , First Publish Date - 2020-10-31T08:45:18+05:30 IST
గుట్కా, ఖైనీల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఒడిశా నుంచి సిక్కోలుకు వీటిని రవాణా చేస్తున్నారు.

ఒడిశా నుంచి సిక్కోలుకు గుట్కాలు,ై
నీలు కోమర్తి కూడలి వద్ద పట్టుబడిన నిల్వలు
నరసన్నపేట, అక్టోబరు 30: గుట్కా, ఖైనీల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఒడిశా నుంచి సిక్కోలుకు వీటిని రవాణా చేస్తున్నారు. తనిఖీల సమయంలో పోలీసులకు లక్షలాది రూపాయల విలువ చేసే ఖైనీ, గుట్కా నిల్వలు తరచూ పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కళ్లు గప్పేందుకు అక్రమార్కులు కొత్త ప్రణాళిక రచించారు. ఎవరికీ అనుమానం రాకుండా.. అంబులెన్స్‌లో వీటిని అక్రమంగా తరలించేందుకు సిద్ధమయ్యారు. ఎస్‌ఈబీ అధికారులకు ఈ సమాచారం అందడంతో నరసన్నపేట పోలీసులతో కలిసి.. శుక్రవారం తెల్లవారుజామున కోమర్తి జంక్షన్ వద్ద తనిఖీలు చేశారు. సుమారు రూ.6.03 లక్షలు విలువ చేసే గుట్కా, ఖైనీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నరసన్నపేట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగుపురానికి చెందిన జామి శ్రీనివాసరావు జిల్లాలో వివిధ ప్రాంతాలకు ఖైనీలు, గుట్కాలను పంపిణీ చేసే ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
కొన్నాళ్లుగా హైటెక్ తరహాలో అంబులెన్స్‌లో గుట్కాలను ఒడిశా నుంచి తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంపై ఎస్‌ఈబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఈబీ అధికారి మన్మథరావు.. స్థానిక పోలీసులతో కలిసి శుక్రవారం తెల్లవారు జామున కోమర్తి జంక్షన్ వద్ద తనిఖీలు చేశారు. ఓ అంబులెన్స్‌ను ఆపి తనిఖీలు చేయగా.. అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపంలోని హడ్డుబంగి నుంచి ఆంరఽధాకు చెందిన అంబులెన్స్‌లో 112 ఖైనీ, గుట్కా బస్తాలను శ్రీకాకుళం మండలం సింగుపురానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. అంబులెన్స్‌లో ఉన్న కె.ఢిల్లీశ్వరరావు(సింగుపురం), రాంబాబు(శ్రీకాకుళం), జి.వెంకటరమణ (ఆమదాలవలస)లను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్‌లో ఉన్న సుమారు రూ.6.03 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన ముగ్గురితో పాటు సింగుపురానికి చెందిన జామి శ్రీనివాసరావు, హడ్డుబంగికి చెందిన బింటు అనే వ్యాపారులపై కేసు నమోదు చేశామని సీఐ తిరుపతిరావు తెలిపారు. పట్టుబడిన ముగ్గురినీ కోర్టుకు తరలించామన్నారు.